: బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్ ని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేస్తున్న ఆగంతుకులు


బీహార్ లోని జముయ్ జిల్లాలోని ఒక జాతీయ బ్యాంకులో పనిచేస్తున్న బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్ లను దుండగులు కిడ్నాప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... వారిద్దరినీ విడుదల చేయాలంటే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని దుండగులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాత్రి ఈ ఉద్యోగులిద్దరూ కిడ్నాప్ కు గురైనట్టు బ్యాంకు నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News