: ఈసారి ఆప్ నిధుల లక్ష్యంగా బీజేపీ కొత్త ప్రకటన
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పై భారతీయ జనతా పార్టీ తమ ప్రకటనల దాడిని తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో మూడో ప్రకటన విడుదల చేసిింది. ఈ తాజా ప్రకటనలో, ఆ పార్టీకి నిధుల రూపంలో అందుతున్నది నల్లధనమేనంటూ ఆరోపించింది. ఆమ్ ఆద్మీకి వస్తున్న నిధుల్లో భారీ స్కామ్ జరిగిందంటూ నిన్న(సోమవారం) ఆప్ వాలంటీర్ యాక్షన్ మంచ్ ఆరోపణలు చేసిన తదుపరి రోజే కార్టూన్ రూపంలో ప్రకటన విడుదల చేయడం గమనార్హం. పలువురు ఇస్తున్న నల్లధనాన్ని నిధుల రూపంలో కేజ్రీ తెల్లధనంగా మార్చుకుంటున్నట్టు కార్టూన్ సాయంతో బీజేపీ వ్యంగ్యంగా చిత్రీకరించింది.