: టీఎస్ హైకోర్టుకు చంద్రబాబు, వెంకయ్యలే అడ్డు: టి.న్యాయవాదులు


తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కాకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు అడ్డుపడుతున్నారని తెలంగాణ న్యాయవాదులు ఆరోపించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి... ఎవరికి వారికి ప్రత్యేకంగా అసెంబ్లీ, సచివాలయాలు ఏర్పడిన తర్వాత కూడా హైకోర్టును ఉమ్మడిగా ఉంచడంలో అర్థం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. హైకోర్టును అడ్డుకుంటున్న చంద్రబాబు, వెంకయ్యల మెడలు వంచి ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News