: హైకోర్టును విభజించాలంటూ టీ.న్యాయవాదుల ధర్నా


ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ 'చలో హైకోర్టు' పేరుతో తెలంగాణ బార్ అసోసియేషన్ ఈరోజు హైకోర్టులో ధర్నా చేపట్టింది. పలు జిల్లాల నుంచి తరలివచ్చిన న్యాయవాదులు పెద్ద ఎత్తున నినాదాలతో ఆందోళన చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కోర్టులో కేసుల విచారణ జరుగుతుండగానే ఆవరణలో న్యాయవాదులు 'జై తెలంగాణ' నినాదాలు చేశారు. వారి ఆందోళన మరింత ఎక్కువకావడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు, కోర్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని నియంత్రించేందుకు ప్రయత్నించారు.

  • Loading...

More Telugu News