: ధనికులకు గ్యాస్ సబ్సిడీ రద్దు!


అధికాదాయవర్గాల వారికి వంట గ్యాస్ సబ్సిడీని రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత సంస్కరణల అమలును వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గత సంవత్సరం డీజిల్ పై నియంత్రణను ఎత్తివేశారు కూడా. ఇక, ఇప్పుడు 30 శాతం పన్ను స్లాబ్ లో ఉన్నవారికి గ్యాస్ సబ్సిడీని తొలగించాలని యోచిస్తున్న మోదీ సర్కారు, ఈ మేరకు రాబోయే బడ్జెట్లో కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఒక్కో గ్యాస్ కనెక్షన్ పై సంవత్సరానికి 12 సిలెండర్లు సబ్సిడీ ధరకు ఇస్తున్న సంగతి తెలిసిందే. అంతకన్నా ఎక్కువ కావాలంటే మాత్రం మార్కెట్ రేటుకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News