: ఆమ్ ఆద్మీ అభ్యర్థి వాహనంపై దాడి


మరో నాలుగు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి వాహనంపై గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. రోహ్ తాస్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్ధి సరితాసింగ్ అర్ధరాత్రి ఇంటికి వెళుతున్న సమయంలో తూర్పు ఢిల్లీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఐరన్ రాడ్లతో కారుపై దాడి చేశారని, ఈ మేరకు ఆమె ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. సరితాసింగ్ సురక్షితంగా ఉన్నారన్నారు. ఈ ఘటనలో ఇంకా కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News