: రైట్ మేన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ: రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ ప్రశంస
తెలంగాణ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి వ్యవహారం టీఆర్ఎస్ నేతలకు అసలు మింగుడు పడదు. రేవంత్ రెడ్డి పేరెత్తితేనే ఒక్కసారిగా వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం. అయితే, టీఆర్ఎస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాత్రం రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. అది కూడా మీడియా మిత్రుల సాక్షిగా. ‘‘రేవంత్ రెడ్డి తెలివైన వాడు. మంచి నేత. బట్, ఏ రైట్ మేన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ’’ అని నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డిలపై రేవంత్ ఆరోపణలు సరికాదని చెబుతూనే నర్సయ్య గౌడ్, టీడీపీ యువ నేతను పొగడటం గమనార్హం.