: చిత్తూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ... ఉపాధ్యాయుడి మృతి
తెలుగు రాష్ట్రాలను స్వైన్ ఫ్లూ మహమ్మారి వణికిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం గోకుల వీధికి చెందిన ఉపాధ్యాయుడు తోట స్వామిరాజు (45) ఈ ఉదయం స్వైన్ ఫ్లూతో మృతి చెందారు. రామసముద్రం మండలం మాలేనత్తం ప్రాథమికోన్నత పాఠశాలలో స్వామిరాజు పనిచేస్తున్నారు. జనవరి మొదటి వారం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న స్వామిరాజు... బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. స్వామిరాజు స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నట్టు ఇటీవలే చిత్తూరు జిల్లా వైద్యాధికారులు కూడా ధ్రువీకరించారు.