: స్వైన్ ఫ్లూపై ఏసీ సమరం... వైరస్ వ్యాప్తిపై నేడు చంద్రబాబు సమీక్ష
ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూపై ఏపీ సర్కారు సమరం ప్రకటించింది. వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు తీసుకోెవాల్సిన చర్యలు, వ్యాధి సోకిన వారికి అవసరమయ్యే చికిత్స ఏర్పాట్లు, పరీక్షల కోసం ప్రయోగ శాలల ఏర్పాటు తదితర కీలకాంశాలపై చర్చించేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు సమావేశం నిర్వహించనున్నారు. వ్యాధి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న వారికి వ్యాధి నిర్ధారణ చేసేందుకు రాష్ట్రంలో వసతులు లేవు. రోగుల నమూనాలను హైదరాబాదులోని ప్రయోగశాలకు పంపి నిర్ధారించుకోవాల్సి వస్తోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీనికి చెక్ పెట్టేందుకు రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మూడు వైరాలజీ ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీటి ఏర్పాటుపై నేటి సమావేశంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు.