: చిన్నారులు స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తే ఎదుగుదలకు హాని చేస్తుందట!


మీ ఇంట్లో చిన్న పిల్లలు అదే పనిగా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ లు, ఈ-బుక్ లు ఉపయోగిస్తుంటే జాగ్రత్తగా ఉండండి. అలాగే వారిని పరధ్యానంగా వదిలేస్తే పిల్లల సామాజిక భావోద్వేగ ఎదుగుదలకు హానికరం కావచ్చని ఓ పరిశోధన సూచిస్తోంది. ఈ మేరకు జరిపిన ఓ పరిశోధనలో అందుబాటులో ఉన్న పలు రకాల ఇంటరాక్టివ్ మీడియా, విద్యా ఉపకరణాలుగా వాడుతున్న వాటికి సంబంధించి పలు ప్రశ్నలను సంధించింది. ఎలక్ట్రానిక్ పుస్తకాలు, బోధనా పదజాలానికి ఉపయోగపడే లెర్నె టు రీడ్, పఠనా గ్రహణశక్తి వంటివి ప్రీస్కూల్ వయస్సు పిల్లలకు లేదా పెద్ద వారికే ఉపయోగపడతాయని తొలుత పరిశోధన సూచించింది. మొబైల్ పరికరం ద్వారా పిల్లలకు విద్యా ప్రయోజనం ఏర్పడినప్పటికీ ప్రాపంచిక విషయాలపట్ల వారిలో ఎటువంటి అభివృద్ధి ఉండదనేది ఈ పరిశోధన అభిప్రాయం.

  • Loading...

More Telugu News