: అక్కడ లీటర్ నీటితోనే స్నానం ముగించేస్తున్నారు!


ప్రపంచంలో అతిపెద్దదైన అమెజాన్ నది ఆ దేశం మీదుగానే ప్రయాణిస్తుంది. కానీ ఆ దేశంలో తీవ్రమైన నీటి సంక్షోభం ఏర్పడింది. కేవలం లీటర్ నీటితోనే అక్కడి ప్రజలు స్నానం ముగించేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బ్రెజిల్ గురించే. బ్రెజిల్ లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో, సావోపాలోలోని రిజర్వాయర్లు ఖాళీ అయ్యాయి. నదులు ఎండిపోయాయి. నీరు దొరకక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులను తాము ఎదుర్కోలేదని వారు పేర్కొంటున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు అత్యల్ప వర్షపాతం నమోదవ్వడంతో తీవ్రమైన నీటి కొరత ఏర్పడిందని బ్రెజిల్ అధికారులు చెబుతున్నారు. జలవనరులు తగ్గిపోవడంతో విద్యుత్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోందని, వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News