: ఓడిపోతామనే ఎన్నికలను వాయిదా వేశారు: టీ సర్కారుపై టీ.టీడీపీ ఫైర్
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల వాయిదాలపర్వంపై హైకోర్టు కేసీఆర్ సర్కారుకు మొట్టికాయలు వేసిన మరుక్షణమే టీ.టీడీపీ ఘాటుగా స్పందించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే, ఓటమి తప్పదన్న భయంతోనే అధికార టీఆర్ఎస్ వాయిదాలపర్వాన్ని కొనసాగిస్తోందని విరుచుకుపడింది. టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, ఆ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు కృష్ణా యాదవ్ లు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఓటమిని తప్పించుకునే క్రమంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కూడా కేసీఆర్ వెనుకాడటంలేదని వారు ధ్వజమెత్తారు.