: ప్రకాశం జిల్లా అవతరణోత్సవాల్లో అపశ్రుతి... తిరగేసిన జాతీయ జెండాను ఎగరేసిన మంత్రి శిద్ధా


ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో నేటి ఉదయం జరిగిన జిల్లా 46వ అవతరణ దినోత్సవాల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. అవతరణోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తిరగేసిన జాతీయ జెండాను ఎగరేశారు. ఆ తర్వాత జాతీయ జెండా తిరగబడి ఉన్న విషయాన్ని గుర్తించిన అధికారులు నాలిక్కరుచుకుని జాతీయ జెండాను సరిచేశారు. జిల్లా అవతరణ దినోత్సవాల్లో భాగంగా ప్రారంభ వేడుకల్లోనే జాతీయ జెండాను అవమానపరిచేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా అధికారులపై మంత్రి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News