: మోదీని ప్రశంసిస్తూనే బీజేపీని విమర్శించిన శశిథరూర్


గతంలో పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రశంసించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఈసారి కూడా అదేపని చేశారు. "పనిపై అత్యంత శ్రద్ధ చూపుతూ, ఓ మాస్టర్ కమ్యూనికేటర్ లా ఉన్న వ్యక్తిని మనమంతా చూస్తున్నాం" అని పేర్కొన్నారు. అదే సమయంలో సంకుచిత హిందుత్వ అజెండాను సిగ్గులేకుండా ప్రోత్సహిస్తోందని బీజేపీపై మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వానికి కమ్యూనికేషనే ప్రధాన బలమని అన్నారు. ప్రధానంగా ప్రధానమంత్రి మాట్లాడే విధానం, స్లోగన్లు, అసమానమైన ప్రసంగాలు, తనతో ఫొటోలకు అవకాశం కల్పించడం తదితర అంశాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని థరూర్ వివరించారు. కాగా, తాను బీజేపీలో చేరే అవకాశం ఉందంటూ వస్తున్న రూమర్లను ఖండించిన థరూర్, కాంగ్రెస్ నేతగానే కొనసాగుతానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News