: నా కార్యాలయం ఓఎస్డీ కేరళ యువతే... అద్భుతంగా పనిచేస్తోంది: కేసీఆర్


‘‘నా కార్యాలయం ఓఎస్డీగా పనిచేస్తున్న ప్రియాంక కేరళకు చెందిన అధికారి. సమర్ధవంతంగా పనిచేస్తున్నారు’’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కేరళ ప్రభుత్వ సహకారంతో నగరంలోని మలయాళీ అసోసియేషన్ (సీటీఆర్‌ఎంఏ) ఆధ్వర్యంలో నిన్న బాలానగర్‌లో ‘కేరళీయం-2015’ పేరిట వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న 4 లక్షల మంది కేరళీయులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు. మలయాళీ అసోసియేషన్ భవనం (కేరళ భవన్) కోసం హైదరాబాదులోని మహేంద్రహిల్స్‌లో ఎకరం భూమిని కేటాయించడంతో పాటు దాని నిర్మాణం కోసం రూ.1 కోటి నిధులు విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. నగరంలో నివసిస్తున్న నిరుపేద మలయాళీలకు పక్కా ఇళ్లు కట్టిస్తానని కూడా సీఎం హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News