: జాతీయ క్రీడల్లో ఏపీ పసిడి బోణీ
కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. వెయిట్ లిఫ్టింగ్ అంశంలో పురుషుల 56 కిలోల విభాగంలో శ్రీనివాసరావు పసిడి చేజిక్కించుకున్నాడు. అటు, మహిళల విభాగంలోనూ ఏపీ సత్తా చాటింది. 48 కిలోల విభాగంలో ఉష, 53 కిలోల విభాగంలో వెంకటలక్ష్మి కాంస్య పతకాలు సాధించారు. దీంతో, ఇప్పటివరకు ఏపీ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. ఈ క్రీడలు శనివారం నాడు ఆడంబరంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.