: తండ్రి ఫోన్ చేయడంతో రూ.2 కోట్ల వేతనం వదులుకుని వచ్చేశాడు!
రాజస్థాన్ లోని నగౌర్ కు చెందిన హనుమాన్ చౌదరి (27) గాథ ఆసక్తికరం! ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ ప్రాంతంలో చౌధరి ఓ రిసార్టులో మేనేజర్ గా వ్యవహరించేవాడు. అందుకతని వేతనం ఏడాదికి దాదాపు రూ.2 కోట్లు. అయితే, ఓ రోజు తండ్రి ఫోన్ చేయడంతో వెంటనే భారత్ వచ్చేశాడు. గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసేందుకే అతడిని స్వదేశానికి రప్పించారు. అందుకో కారణం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస విద్యార్హత ఎనిమిదవ తరగతిగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఆ ఊర్లో అర్హుల సంఖ్య అంతంతమాత్రమే. దీంతో, చౌదరి తండ్రి భురాం వెంటనే ఫోన్ చేసి కుమారుడిని సర్పంచ్ గా పోటీచేయాలని కోరాడు. తండ్రి మాటను గౌరవిస్తూ ఆ యువకుడు భారత్ రావడం, ఎన్నికల్లో పాల్గొనడం, గెలవడం చకచకా జరిగిపోయాయి. అన్నయ్య, తండ్రి ప్రోత్సాహంతోనే ఎన్నికల్లో పోటీచేశానని ఈ యువకుడు పేర్కొన్నాడు. సమాజసేవ పట్ల ఆసక్తి కూడా తనను ఎన్నికలదిశగా నడిపించిందని వివరించాడు.