: మే నెలలో చైనా పర్యటనకు ప్రధాని మోదీ


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేసవిలో చైనా వెళుతున్నారు. మే నెలలో ఆయన చైనాలో పర్యటిస్తారని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ తెలిపారు. నాలుగు రోజుల పర్యటనకు గాను ప్రస్తుతం ఆమె చైనాలో ఉన్నారు. విదేశాంగ శాఖ నూతన కార్యదర్శి జైశంకర్ తో కలిసి సుష్మ చైనా వచ్చారు. చైనాలో భారతీయులనుద్దేశించి మాట్లాడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు ఇదే తొలి చైనా పర్యటన అని సుష్మ తెలిపారు. కైలాష్ మానస సరోవర్ యాత్రకు మరో మార్గం ఏర్పాటు చేసే విషయమై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టిపెట్టానని చెప్పారు. ఈ అదనపు మార్గం ద్వారా యాత్రికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం వీలవుతుందని వివరించారు. కాగా, గతేడాది సెప్టెంబర్ లో చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ భారత్ లో పర్యటించగా, అందుకు ప్రతిగానే మోదీ చైనా వెళుతున్నారు.

  • Loading...

More Telugu News