: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రికి స్వైన్ ఫ్లూ
దేశంలో స్వైన్ ఫ్లూ వైరస్ ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. తాజాగా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆయనకు పరీక్షలు నిర్వహించగా ఫలితం పాజిటివ్ గా వచ్చింది. నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం ఢిల్లీ పంపారు. తన ఆరోగ్య పరిస్థితిపై గెహ్లాట్ ట్విట్టర్లో స్పందించారు. సకాలంలో చికిత్స తీసుకోవడంతో క్రమంగా కోలుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. అటు, అధికార బీజేపీపై విమర్శలు చేశారు. రాష్ట్ర సర్కారు స్వైన్ ఫ్లూపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆరోపించారు.