: బెజవాడలో విషాదం... శ్లాబ్ కూలి ఇద్దరు మృతి
విజయవాడలో కొద్దిసేపటి క్రితం విషాదం చోటుచేసుకుంది. భవనం మరమ్మతు పనుల్లో ముగినిపోయిన మేస్త్రీ, కూలీలపై శ్లాబ్ విరిగిపడింది. నగరంలోని విద్యాధరపురం పరిధిలోని కుమ్మరపాలెం సెంటర్ కొట్టేటి కోటయ్య వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీధిలోని ఓ పాత ఇంటికి మరమ్మతు చేస్తుండగా, ప్రమాదవశాత్తు శ్లాబ్ విరిగి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మేస్త్రీగా పనిచేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మేస్త్రీని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.