: గుంటూరులో గ్యాస్ సిలిండర్ పేలుడు... తల్లీ కూతుళ్లకు గాయాలు
తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. విశాఖ, విజయవాడల్లో ఇటీవల చోటుచేసుకున్న గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలను మరచిపోకముందే గుంటూరులో మరో ప్రమాదం జరిగింది. నగరంలోని నకరికల్లులో ఓ ఇంటిలో కొద్దిసేపటి క్రితం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు కారణంగా ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో గాయాలపాలైన తల్లీ కూతుళ్లను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.