: పశ్చిమలో నలుగురు... గుంటూరు జిల్లాలో ఇద్దరు: ఏపీలో విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ
కొన్ని రోజుల పాటు తెలంగాణను కుదిపేసిన స్వైన్ ఫ్లూ మహమ్మారి, తాజాగా ఏపీలో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే నేటి ఉదయం అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కాగా పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ వ్యాధి కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు ఈ వ్యాధి బారిన పడగా, గుంటూరు జిల్లాలో ఇద్దరు వ్యక్తులకు వ్యాధి నిర్ధారణ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లోనే కాక ఏపీ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.