: అవినీతికి పాల్పడితే సహించం: మంత్రి కడియం


ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడితే ఊరుకునేది లేదని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అధికారులు జాగ్రత్తగా పనిచేసి మంచి పాలన అందించాలని సూచించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో వరంగల్ నగర పాలక సంస్థ నాశనమైందని కడియం ఆరోపించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ వరంగల్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పుకొచ్చారు. ఈరోజు జిల్లాలో రూ.3 కోట్ల విలువైన పనులకు కడియం శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో పైవిధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News