: యువతి ప్రాణాలు కాపాడిన కాల్ సెంటర్ ఫోన్ కాల్


కాల్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు, మనలో చాలా మంది విసుక్కుంటారు. వీళ్లకి వేళాపాళాలేదంటూ కసురుకుంటారు. అలాంటి ఓ ఫోన్ కాల్ ఓ యువతి ప్రాణాల్ని కాపాడింది. అమెరికాలోని లాస్ వెగాస్ కు చెందిన్ అమెరికన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కాల్ సెంటర్ నుంచి చమెల్లీ మ్యాక్ ఎలోరి అనే ఉద్యోగిని అక్కడికి 1448 కిలోమీటర్ల దూరంలో ఓరగాన్ (లెబనాన్) పట్టణంలోని ఓ క్లయింటుకి ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన క్లయింట్ హలో అన్న గొంతు కాకుండా రక్షించాలంటూ చేసిన ఆర్తనాదాన్ని వింది. దీంతో ఆమె ఫోన్ పెట్టేయకుండా, షిప్ట్ ఇన్ఛార్జ్ టినా గ్రేషియాకు తెలిపింది. ఆమె కంపెనీ సీఈవో మారియో గొంజెలెజ్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. ఆయన కూడా ఫోన్ లో ఆమె ఆర్తనాదాలు విన్నారు. దీంతో ఆయన ఓరెగాన్ పోలీసులకు విషయం వివరించారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా క్షణాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు, భర్త చేేతిలో హింసకు గురవుతున్న భార్యను గమనించి, అదుపులోకి తీసుకున్నారు. తన భర్త దిండ్లు, బ్లాంకెట్లతో ఊపిరాడకుండా చేసి చంపేసేందుకు ప్రయత్నించాడని, ఇంతలో ఫోన్ రావడంతో ఆన్ చేశానని, తనను రక్షించిన కాల్ సెంటర్ సిబ్బందికి ధన్యవాదాలని ఆమె తెలిపింది. పోలీసులు కూడా కాల్ సెంటర్ కి ఫోన్ చేసి సిబ్బందిని అభినందించారు.

  • Loading...

More Telugu News