: తమిళనాడులో ఘోర ప్రమాదం... కెమికల్ ట్యాంకర్ పైప్ లైన్ పేలి 13 మంది దుర్మరణం


తమిళనాడు రాష్ట్రంలో ఈ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వేలూరు జిల్లాలోని రాణిపేట లెదర్ ఫ్యాక్టరీలో కెమికల్ ట్యాంకర్ పైప్ లైన్ ఒక్కసారిగా పేలింది. ఈ ధాటికి అక్కడున్న గోడ కుప్పకూలడంతో గోడ వారగా పడుకొని నిద్రిస్తున్న 13 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. శిథిలాల క్రింద చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతున్న ముగ్గురిని సహాయక సిబ్బంది రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News