: కోర్టు మొట్టికాయలతో దిగొచ్చిన కేసీఆర్: ఏపీ మంత్రి గంటా


విద్యార్థులకు బోధనా రుసుము చెల్లించే విషయంలో కోర్టు మొట్టికాయలు వేయడంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగొచ్చారని ఆంధ్రప్రదేశ్ విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగిందని వ్యాఖ్యానించిన ఆయన, విద్యార్థులకు మేలు కలిగితే, అదే తమకు పదివేలని తెలిపారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజల దృష్టిని మరల్చడానికే ఆయన వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగంగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకొని, కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. చట్టం పట్ల గౌరవం చూపకుండా ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News