: ఫాస్ట్ పై తెలంగాణ సర్కారు వెనుకడుగు... పాత పద్ధతిలోనే బో'ధనం'
ఫీజు బకాయిల చెల్లింపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన వివాదాస్పద ఫాస్ట్ పథకాన్ని విరమించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. పాత పద్ధతిలోనే ఫీజు తిరిగి చెల్లించే పథకాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయన అధ్యక్షతన నిన్న సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశం తరువాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఫీజుల తిరిగి చెల్లింపునకు సంబంధించి నాలుగేళ్ల బకాయిలను గత ప్రభుత్వం తమ నెత్తిన పోసిందని ఆయన ఆరోపించారు. రూ.1650 కోట్లకు పైగా ఉన్న ఈ బకాయిల్లో ఇంకా రూ.862 కోట్లు చెల్లించాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. వీటిని వెంటనే చెల్లిస్తామని, పేద విద్యార్థులకు సంబంధించింది కాబట్టి ఫాస్ట్ ను రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగిస్తామని వివరించారు.