: బాలీవుడ్ సినిమా ఫార్ములా ఫాలో అయి చీవాట్లు తిన్న యువకుడు


భారతీయ సినిమాల్లో హీరోలు హీరోయిన్లను రోడ్డు మీద చూసి ప్రేమలో పడిపోతుంటారు. హీరోయిన్ ప్రేమను దక్కించుకునేందుకు ఆమె వెంటపడి ఏడిపిస్తారు, అల్లరి చేస్తారు. ఈ కోతి వేషాలు చూసి హీరోయిన్ పీకల్లోతు ప్రేమలో పడిపోతుంది. అదే ఫార్ములాను ఆస్ట్రేలియాలో ఓ భారతీయుడు ఫాలో అయ్యాడు. 32ఏళ్ల ఈ యువకుడు ఓ అందమైన అమ్మాయి వెంటపడ్డాడు. 18 నెలలపాటు తిరిగినా ఆ యువతి పట్టించుకోలేదు. దీంతో మరో యువతి వెంటపడ్డాడు. నాలుగు నెలలపాటు తిరిగితే పట్టించుకోలేదు సరికదా, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ భగ్నప్రేమికుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ సందర్భంగా బాలీవుడ్ సినిమాలు చూసి అమ్మాయిల వెంటబడ్డానని, అలా చేస్తే అమ్మాయిలు ప్రేమలో పడతారని భావించాను కానీ, వారిని ఏడిపించాలని భావించలేదని మెజిస్ట్రేట్ కోర్టుకు తెలిపాడు. దీనికి తోడు అమ్మాయిల వెంటపడడం భారత్ లో సర్వసాధారణమని, అలా చేయడం అక్కడ ఎంత మాత్రం తప్పుకాదని అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. దీంతో అతని కుటుంబ నేపథ్యాన్ని పరిగణనలోనికి తీసుకున్న మెజిస్ట్రేట్ అతనికి శిక్ష విధించకుండా వదిలేశారు. అయితే బాలీవుడ్ సినిమాలు చూసినా సరే ఐదేళ్లపాటు అమ్మాయిల వెంటపడకూడదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News