: ఏపీ ఖజానా నుంచి చెల్లింపుల ఆంక్షల్లో సడలింపు


ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి చెల్లింపుల ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. ఉద్యోగుల జీతాల చెల్లింపులు యథావిధిగా చేపట్టాలని, పెన్షన్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్నిరోజుల కిందట ఖజానా నుంచి చెల్లింపులు ఆపివేయాలని ప్రభుత్వం అకస్మాత్తుగా ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News