: జయంతి నటరాజన్ ప్రస్తావించిన ఫైళ్లను పరిశీలిస్తాం: జవదేకర్
యూపీఏ-2 హయాంలో పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఫైళ్లకు రాహుల్ సిఫార్సులపై అనుమతులిచ్చిన అంశాలను కాంగ్రెస్ మాజీ నేత జయంతి నటరాజన్ వెల్లడించడంపై కేంద్రం స్పందించింది. ప్రస్తుత పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ, సంబంధిత ఫైళ్లను తప్పకుండా పరిశీలిస్తానని తెలిపారు. వాటిలో నిజానిజాలేంటో తెలుసుకుంటానన్నారు. అయితే, నాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖలో ఆమె చెప్పిన అంశాలు చాలా తీవ్రమైనవని, ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అనుమతులకు సంబంధించి రాహుల్ గాందీతో పాటు పలువురు తనపై ఒత్తిడి తెచ్చారంటూ తాజాగా నటరాజన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.