: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సానియా జోడీ ఓటమి... ఫైనల్లో పేస్ జోడీ
మెల్ బోర్న్ లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సానియా మీర్జా-బ్రూనో సొరెస్ (బ్రెజిల్) జోడీ పోరాటం ముగిసింది. సానియా జోడీ మిక్స్ డ్ డబుల్స్ సెమీ ఫైనల్స్ నుంచి వెనుదిరిగింది. సానియా-సోరెస్ ద్వయం ఫ్రెంచ్-కెనడియన్ జోడీ క్రిస్టినా మ్లదనొవిక్, డానియెల్ నెస్టర్ చేతిలో 6-3, 2-6, 8-10 తో పరాజయం పాలైంది. మరోవైపు, భారత క్రీడాకారుడు లియాండర్ పేస్-మార్టినా హింగిస్ జోడీ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్ కు చేరింది.