: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్... రోహిత్ స్థానంలో రాయుడు
ఆస్ట్రేలియా నగరం పెర్త్ లో మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని, భారత్ ను బ్యాటింగుకు ఆహ్వానించింది. ఫైనల్ బెర్తును ఖరారు చేసే ఈ మ్యాచ్, అటు ఇంగ్లాండుతో పాటు, ఇటు టీమిండియాకు కూడా కీలకమే. ఇదిలా ఉంటే, గాయం కారణంగా టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ నేటి మ్యాచ్ కు దూరమయ్యాడు. రోహిత్ స్థానంలో తెలుగు తేజం అంబటి రాయుడు బరిలోకి దిగుతున్నాడు. ఇక, సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ స్థానంలో మోహిత్ శర్మను బరిలోకి దింపాలని టీమిండియా నిర్ణయించింది.