: హైదరాబాదులో స్వైన్ ఫ్లూతో మరో ఇద్దరు మృతి
హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో తాజాగా ఇద్దరు మృతి చెందారు. వారిద్దరూ నిజామాబాద్ కు చెందిన ఓ మహిళ (58), నగరంలో మాదాపూర్ కు చెందిన ఓ యువకుడి (35)గా గుర్తించారు. దాంతో తెలంగాణలో ఫ్లూతో చనిపోయిన వారి సంఖ్య 27కు చేరింది. ప్రస్తుతం గాంధీలో ఫ్లూతో చికిత్స పొందుతున్న రోగులు 43 మంది ఉండగా, 10 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో 12 మంది చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్యపై స్పష్టత లేదని తెలిసింది.