: ఏపీకి చంద్రబాబే పెట్టుబడి, రాజధాని: మంత్రి పల్లె
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఘనంగా కీర్తించారు. తెలంగాణకు హైదరాబాద్ రాజధాని అయితే, ఏపీకి చంద్రబాబే పెట్టుబడి, రాజధాని అని అభివర్ణించారు. విశాఖలో జరిగిన స్టార్ట్ అప్ విలేజ్ బూట్ క్యాంపులో పాల్గొన్న మంత్రి పైవిధంగా మాట్లాడారు. కాకినాడ, విజయవాడ, అనంతపురం, తిరుపతిలో స్టార్ట్ అప్ విలేజ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. 2015 నాటికి 500ల స్టార్ట్ అప్ విలేజ్ ల ఏర్పాటే లక్ష్యమని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీ రంగంలో ఏపీ ఎక్కువ రాయితీలు కల్పిస్తోందని, పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని మంత్రి తెలిపారు. ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పన తమ ధ్యేయమని పేర్కొన్నారు.