: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ లో సెరెనా... 8 ఏళ్ల తర్వాత షరపోవాతో టైటిల్ పోరు!


ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మహిళల సింగిల్స్ ఫైనల్స్ లోకి 'విలియమ్స్ సిస్టర్' సెరెనా విలియమ్స్ అడుగు పెట్టింది. కొద్దిసేపటి క్రితం ముగిసిన రెండో సెమీ ఫైనల్ లో మ్యాడిసన్ కీస్ పై సెరెనా విజయం సాధించింది. వరుస సెట్లలో 7-6, 6-2 స్కోరుతో సునాయసంగా నెగ్గిన సెరెనా విలియమ్స్, ఫైనల్ లో రష్యా బ్యూటీ మరియా షరపోవాతో తలపడనుంది. నేటి ఉదయం జరిగిన తొలి సెమీ ఫైనల్ లో షరపోవా, మకరోవాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఎనిమిదేళ్ల క్రితం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సెరెనా, షరపోవాలు టైటిల్ కోసం తలపడ్డారు. నాటి పోటీలో షరపోవాపై సెరెనా విజయం సాధించి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. మరి ఈసారి ఫైనల్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News