: మిమ్మల్ని నిరాశపరుస్తున్నా: ఎన్టీఆర్
'గత కొంత కాలంగా మిమ్మల్ని ఎక్కడో నిరాశపరుస్తున్నా...' అన్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి. టెంపర్ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'ఈ రోజు నేనిలా ఉన్నానంటే కారణం, అభిమానులు, పైన ఉన్న మహానుభావుడే'నని అన్నారు. అభిమానులంతా ఆనందంగా ఉండేలా చూస్తానని అన్నారు. ప్రతి సినిమా ఇష్టంగా చేశాను, కసితో చేశానని అన్నారు. ఒకవేళ ఈ సినిమా నచ్చకపోతే, మీకు నచ్చేవరకు సినిమాలు చేస్తానని అన్నారు. 2015 నందమూరి నామ సంవత్సరం, కావాలంటే రాసుకోవాలని అన్నారు. ప్రతిసారి ఏం మాట్లాడాలో క్లారిటీ ఉండేదని, ఈ సారి క్లారిటీ లేదని అన్నారు. భార్య, బిడ్డలు, అభిమానుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన తెలిపారు.