: తప్పుడు రేప్ కేసు పెడితే శిక్షించాల్సిందే!: ఢిల్లీ న్యాయస్థానం
మహిళలు తప్పుడు రేప్ కేసు పెడితే శిక్షించాల్సిందేనని ఢిల్లీ కోర్టు పేర్కొంది. తప్పుడు రేప్ కేసుల కారణంగా నేరాల సంఖ్య పెరుగుతున్నట్టు కనబడి, సమాజంలో మహిళల భద్రతపై భయాందోళనలు వ్యాప్తి చెందుతాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. రేప్ కేసుల్లో ఇరుక్కున్న నిందితుల సమాచారం సమాజంలోకి వెళ్లి, నిందితులు తలదించుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయని న్యాయస్థానం పేర్కొంది. తప్పుడు రేప్ కేసు కారణంగా నిందితులు, వారి కుటుంబాలు పరువు ప్రతిష్టలు కోల్పోవలసి వస్తుందని న్యాయస్థానం తెలిపింది. తప్పుడు రేప్ కేసులు పెట్టే మహిళలు బాధితులు కారని పేర్కొన్న న్యాయస్థానం, అలాంటి వారిని చట్టప్రకారం శిక్షించాలని సూచించింది.