: కోల్ ఇండియాలో 10 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వ నిర్ణయం
కోల్ ఇండియాలో పది శాతం వాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30న వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ అమ్మకం ద్వారా ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ప్రభుత్వానికి సుమారు 24 వేల కోట్ల రూపాయల ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి సమకూరనుంది. కాగా, దేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు, రైల్వేలకు, విదేశీ అవసరాలకు కోల్ ఇండియా బొగ్గును ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే.