: తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన డ్రైవర్


తిన్న ఇంటి వాసాలను ఓ డ్రైవర్ లాఘవంగా లెక్కపెట్టేశాడు. భృతి కల్పించి ఆదరించిన ఇంటికే కన్నం వేశాడో డ్రైవర్. హైదరాబాదు, బోయిన్ పల్లి దగ్గర తాడ్ బండ్ లోని అనంత ఎన్ క్లేవ్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో సంపన్న వర్గానికి చెందిన అజయ్ హరినాథ్ నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన మహ్మద్ తహసీన్ (27) ఇతని వద్ద ఏడేళ్లుగా డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. యజమాని వద్ద నమ్మకస్తుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఆయనపై యజమాని ఆంక్షలు పెద్దగా ఉండేవి కాదు. దీనిని ఆసరాగా తీసుకున్న తహసీన్ విలాసవంతమైన జీవితం గడపాలని భావించాడు. దీంతో నెమ్మదిగా యజమాని ఇంట్లోంచి నగదు, నగలు దొంగిలించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో యజమాని ఇంట్లోంచి గత నవంబర్, డిసెంబర్ నెలల్లో పెద్దమొత్తంలో నగదు, బంగారం మాయమైంది. దీనిని గ్రహించిన అజయ్ బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే డ్రైవర్ తీరులో మార్పులు కూడా చెప్పారు. దీంతో పోలీసులు అతని జీవనశైలిపై దర్యాప్తు చేశారు. ఇటీవలే తహసీన్ నాలుగు ఇన్నోవాలు కొనుగోలు చేయడం, రెండు ద్విచక్రవాహనాలు కొనుగోలు చేయడం, ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్లు తదితర వ్యవహారాలు వెలుగు చూశాయి. దీంతో అతని నుంచి పోలీసులు 12.70 లక్షల నగదు, నాలుగు ఇన్నోవాలు, రెండు ద్విచక్రవాహనాలు, 2,300 గ్రాముల బంగారం బిస్కెట్లు, 15 తులాల బంగారు ఆభరణాలు, ల్యాప్ టాప్, మూడు ఖరీదైన సెల్ ఫోన్లు, ఖరీదైన రిస్ట్ వాచ్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం తస్కరణ, అమ్మకంలో తహసీన్ కు కొనుగోలు చేసిన మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News