: 'పద్మ భూషణ్' ప్రకటించడంపై భారత్ కు బిల్ గేట్స్ దంపతుల ధన్యవాదాలు


భారత ప్రభుత్వం తమకు 'పద్మభూషణ్' పురస్కారం ప్రకటించడం పట్ల బిల్ గేట్స్, మిలిందా గేట్స్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో భారత్ వృద్ధి దిశగా కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు. "సమాజ సేవకుగానూ పలువురు ప్రముఖ వ్యక్తులతో పాటు 'పద్మ' అవార్డు తీసుకోబోతుండటం చాలా గర్వంగా భావిస్తున్నాం. ఇంతటి అత్యున్నత పురస్కారానికి మమ్మల్ని ఎంపిక చేసిన సందర్భంగా ప్రభుత్వానికి థాంక్స్ చెబుతున్నాం" అని ఓ ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలువురికి పుద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News