: మనలో కొందరు ఎదుర్కొనేదే... అది దెయ్యం పని కాదట!


మనలో కొందరికి మంచి నిద్రలో ఉండగా అకస్మాత్తుగా గుండెమీద ఎవరో కూర్చొని ఉన్నట్టు, గొంతు పిసుకుతున్నట్టు అనిపించడం ఏదో ఒక సందర్భంలో అనుభవం లోకి వస్తుంది. దానిని దెయ్యంగా భావించడం, భయపడడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి. తెల్లారి లేచి సన్నిహితులకు దానిని రకరకాలుగా వర్ణించి మన అనుభవం పంచుకుంటాం. అయితే అది దెయ్యం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. దానిని 'స్లీపింగ్ పెరాలసిస్' అని అంటారని, ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మంది ప్రజలకు ఇలాంటి అనుభం ఎదురవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఒక న్యూరల్ మ్యాప్ రూపొందించారు. మెదడులో నిర్దేశిత ప్రాంతంలో చోటుచేసుకునే 'కల్లోలం' దెయ్యాలు, రాక్షసుల రూపంలో నిద్రలో కనిపిస్తుందని వారు తెలిపారు. దీనినే మనం దెయ్యంగా భావించి భయపడతామని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News