: ఆ ప్రకటనలు ఆపండి... గూగుల్, యాహూ సైట్లకు సుప్రీం కోర్టు ఆదేశాలు
గూగుల్ ఇండియా, యాహూ వెబ్ సైట్లలో లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన అడ్వర్టైజ్ మెంట్లు రావడంపై సుప్రీంకోర్టు మండిపడింది. తక్షణం అలాంటి ప్రకటనలు ఆపేయాలని గూగుల్, యాహూ సంస్థలకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా, గూగుల్, యాహూ వెబ్ సైట్లలో లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ప్రకటనలు గత కొంతకాలంగా కనిపిస్తున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు భారతదేశంలో చట్ట వ్యతిరేకం. లింగ నిర్ధారణ పరీక్షల కారణంగా, దేశంలో భ్రూణహత్యలు చేటుచేసుకుంటున్నాయి. తద్వారా లింగ నిష్పత్తిలో వ్యత్యాసం కనిపిస్తోంది.