: ఆ ఎయిర్ పోర్టులో అత్యంత రద్దీకి భారతీయులే కారణం!


ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంగా దుబాయి నిలిచింది. గత సంవత్సరం ఈ జాబితాలో లండన్ హీత్రూ విమానాశ్రయం మొదటి స్థానంలో ఉండేది. అరబ్ దేశాలకు వెళ్లి వచ్చే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇప్పుడా ఘనత దుబాయికి దక్కింది. గత సంవత్సరం దుబాయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణాలు సాగించిన భారతీయుల సంఖ్య 9.3 లక్షలు. 2014లో ఈ విమానాశ్రయం నుంచి 7 కోట్ల మంది ప్రయాణాలు జరిపారు. ఇదే సమయంలో లండన్ హీత్రూ నుంచి ప్రయాణాలు చేసిన వారి సంఖ్య 6.8 కోట్లు మాత్రమే. ఇండియాలోని 10 నగరాల నుంచి వారానికి 185 విమాన సర్వీసులు దుబాయికి నడుస్తున్నాయి. కాగా, దుబాయికి వెళ్లివస్తున్న విదేశీయులలో పశ్చిమ యూరప్ దే అగ్రస్థానం. యూరప్ దేశాల నుంచి 11,92,831 మంది ప్రయాణించారని దుబాయి ఎయిర్ పోర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News