: లాలా లజపత్ రాయ్ కు ట్విట్టర్ లో మోదీ నివాళులు
స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపత్ రాయ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ లో నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ఓ సందేశాన్ని పోస్టు చేశారు. "పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. జయంతి సందర్భంగా ఈ భరతమాత ముద్దుబిడ్డకు నేను సెల్యూట్ చేస్తున్నా" అని మోదీ పేర్కొన్నారు. 1865లో జన్మించిన రాయ్, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్ర్యంకోసం పోరాడిన సమరయోధుడిగా స్మరణీయుడు.