: ప్రైవేటు ట్రావెల్స్ పై చర్యలు తీసుకుంటాం: మంత్రి శిద్ధా రాఘవరావు


ప్రకాశం జిల్లా చాగల్లు వద్ద వోల్వో బస్సు దగ్ధం కాగా, ఘటనాస్థలిని ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాగల్లు ఘటనపై నెల్లూరు డీటీసీని విచారణ అధికారిగా నియమించామని తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా, గతరాత్రి జరిగిన ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. బస్సు మాత్రం కాలిపోయింది.

  • Loading...

More Telugu News