: ఎంసెట్ వివాదం నేడైనా కొలిక్కి వచ్చేనా?: గవర్నర్ నరసింహన్ తో చంద్రబాబు భేటీ


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. హైదరాబాదులోని రాజ్ భవన్ కు కొద్దిసేపటి క్రితం చేరుకున్న చంద్రబాబు, గవర్నర్ తో భేటీ అయ్యారు. ఎంసెట్ నిర్వహణ, తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ తదితర కీలక అంశాలపై చంద్రబాబు, గవర్నర్ తో చర్చించే అవకాశాలున్నట్టు సమాచారం. అంతేగాక, ఎంసెట్ నిర్వహణపై నెలకొన్న వివాదానికి చరమగీతం పాడాలని కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ఉన్నపళంగా గవర్నర్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News