: హైదరాబాదులో భారీగా పేలుడు పధార్థాలు లభ్యం... ఐదుగురి అరెస్ట్


హైదరాబాదులో కొద్దిసేపటి క్రితం భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. రాజేంద్రనగర్ లో ఉదయం ముమ్మర తనిఖీలు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) పోలీసులు ఓ ఇంటిలో భారీ సంఖ్యలో పేలుడు పదార్ధాలను కనుగొన్నారు. వీటిలో అమ్మోనియం డిటోనేటర్లు, నైట్రో గ్లిజరిన్ ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నారు. పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో పేలుడు పదార్థాలు లభించిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, ఎక్కడి నుంచి పేలుడు పదార్థాలు వచ్చాయి? ఎందుకోసం వీటిని నిల్వ చేశారు? దీని వెనుక ఉన్న వ్యక్తులెవరన్న అంశాలను నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News