: ట్విట్టర్ నుంచి రెండు కొత్త ఫీచర్లు


సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కొత్త గ్రూప్ చాట్, వీడియో ఫీచర్స్ ను లాంఛ్ చేసింది. దీని ద్వారా ఒకేసారి పలువురికి సందేశం పంపేందుకు ఈ గ్రూప్ చాట్ ఉపయోగపడుతుందట. దీని ద్వారా మనల్ని ఫాలో అవుతున్న ఎవరితోనైనా సంభాషించవచ్చు. ఇదే సమయంలో గ్రూప్ చాట్ లో పాల్గొనేవారు ఒకరినొకరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో, ఇతరులకు నేరుగా సందేశం పంపడాన్ని కూడా ట్విట్టర్ అనుమతిస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఏకంగా 20 మందితో సమాచారాన్ని షేర్ చేసుకునే సామర్ధ్యం కల్పిస్తోంది. ఇక స్మార్ట్ ఫోన్లలో వీడియోలను చాలా తేలికగా క్యాప్చర్ చేసుకోవడం, ఎడిట్ చేయడం, వీడియోలను షేర్ చేసుకునేందుకు ట్విట్టర్ అప్లికేషన్ లో మార్పులు తీసుకొచ్చింది. దాంతో, 30 సెకన్లు లేదా అంతకంటే తక్కువ నిడివి ఉన్న వీడియోలను కూడా షేర్ చేసుకోవచ్చు. వచ్చే కొన్ని వారాల్లో ట్విట్టర్ వినియోగదారులందరికీ ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయట.

  • Loading...

More Telugu News