: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల కాదట... ఏఐసీసీ నుంచి లేఖ
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అని అందరికీ తెలిసిందే. కానీ ఏఐసీసీ నుంచి వచ్చిన ఒక లేఖను చూస్తే మాత్రం టీపీసీసీ అధ్యక్షుడెవరనే సందేహం కలగక మానదు. ఇంతకీ విషయం ఏంటంటే... నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన గడ్డం నర్సారెడ్డి గతంలో జన తెలంగాణ పార్టీని పెట్టి ఆపై దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆపై తనకు ఏదో ఒక పదవి ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. తాజాగా ఆ లేఖ అందిందని ఏఐసీసీ ప్రత్యుత్తరం పంపింది. అందులో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి అని పేర్కొన్నారు. ఇది చూసి, ఏఐసీసీ సభ్యులకు టీపీసీసీ అధ్యక్షుడు ఎవరో తెలియదా? అని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.