: ఆడపిల్లలను వేధించే పోకిరీలకు చెప్పుదెబ్బలతో బుద్ధి చెప్పండి!: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్య


శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా నిన్న జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాంలోని సీఎంఆర్ఐటీ కళాశాల విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఆడపిల్లలపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై వేధింపులకు పాల్పడే పోకిరీలకు చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. సొంత ఊరుతో పాటు కన్న తల్లిని ఎవరూ మరువరాదని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News